News

చెట్టుకు పుట్టినరోజు వేడుకలు

638views

ప్రకృతిలో భాగమైన చెట్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ కొందరు యువకులు ఓ వృక్షానికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రావి చెట్టుకు నలభై ఏళ్లు నిండిన సందర్భంగా కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్‌లోని పులియాకులం కురుపారాయణ్‌ కోయిల్‌ వీధిలో చాలా ఏళ్ల క్రితం ఓ రావి మొక్కను నాటారు. కొద్ది కాలం తర్వాత సరైన పోషణ లేక అది వాడిపోయింది. గమనించిన స్థానికులు.. అప్పటి నుంచి దానికి తరచూ నీరు పోయడం అలవాటు చేసుకున్నారు. ఇలా ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఆ చెట్టుకు నలభై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ వృక్షానికి జన్మదిన వేడుకలు నిర్వహించారు. చెట్టు కింద వినాయక విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. ఇకపై ఏటా ఇలాంటి వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.