NewsSeva

సేవాభారతి ఆధ్వర్యంలో ప్లాస్మా దానం

443views

సేవాభారతి కర్నూలు ఆధ్వర్యంలో సంఘమిత్ర మార్గదర్శనంలోకర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు ప్రాణ దానం నిమిత్తం నంద్యాల సంఘమిత్ర నుండి ఈ రోజున  నలుగురు ప్లాస్మా దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. సురేష్, నాగ సుధాకర్, రఘు, సూర్యతేజ అనే వ్యక్తులు కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడు నిమిత్తం ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు వచ్చారు. డా. లక్ష్మయ్య, డా. నేట్ల మహేశ్వర రెడ్డి ల పర్యవేక్షణలో ఈ ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం జరిగినది. సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరి శ్రీనివాస్, డా”ఉదయ్ శంకర్, శ్రీ రాంప్రసాద్ తదితరులు ప్లాస్మా దాతలకు తోడుగా తరలివచ్చారు. IOB బ్యాంకు మేనేజర్ రమేష్ గారి జ్యోతి ప్రజ్వలనతో ప్లాస్మా దానం కార్యక్రమం ప్రారంభం అయింది.

జిల్లా కోవిడ్ నోడల్ అధికారి శ్రీ.డా.మోక్షేశ్వరుడు గారి ఆధ్వర్యంలో  నంద్యాల నుండి విచ్చేసిన నలుగురు  దాతల ద్వారా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగినది.

ప్లాస్మా డొనేషన్ కార్యక్రమానికి సహకరించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది  శ్రీ అప్పలనాయుడు, జగదీశ్వర రెడ్డి, జానకి, సంధ్యలకు సేవాభారతి తరపున సేవా భారతి సహకార్యదర్శి, శ్రీ పి. సత్యనారాయణ, శ్రీ లింగం శ్రీనివాస్ లు ధన్యవాదములు తెలిపారు. ప్లాస్మా దానం చెయ్యడం ద్వారా ఈ నలుగురు పది మందికి ఆదర్శంగా నిలిచారని డా. లక్ష్మయ్య, డా. నేట్ల మహేశ్వర రెడ్డి లు ప్లాస్మా దాతలను అభినందించారు. ప్లాస్మా దానం చెయ్యడం వల్ల ఎటువంటి అనారోగ్యం కానీ, ఇబ్బంది కానీ కలుగదని, కోవిడ్ కారణంగా ప్రాణాపాయ పరిస్థితులలో వున్న అనేక మంది కోవిడ్ రోగుల చికిత్సకు ప్లాస్మా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్లాస్మా దాతలందరూ ప్రాణ దాతలని, కనుక కోవిడ్ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు రావాలని వారు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.