News

డిప్యూటీ  కలెక్టర్‌ శిక్షణకు కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి

462views

గాల్వాన్ ఘర్షణలో మృతి చెందిన సంతోష్‌బాబు సతీమణి బికుమల్ల సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర పాటు శాఖాపరమైన శిక్షణ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా ఏదేనీ జిల్లాలో క్షేత్రస్థాయి పాలనా వ్యవహారాల్లో శిక్షణకు పంపనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంసీహెచ్‌ఆర్‌సీలో జరిగే శిక్షణకు హాజరుకావాలని శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.