News

శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’

124views

భారత్‌కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌లపై అధ్యక్షుడి సలహాసంఘం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అగ్ర రాజ్యానికి ఏఏఎన్‌హెచ్‌పీఐ ప్రతినిధులు చేస్తున్న సహకారానికి గుర్తుగా శ్వేతసౌధంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో శ్వేతసౌధం మెరైన్‌ బ్యాండ్‌ ‘సారే జహాసే అచ్ఛా’ గీతంతో ఆకట్టుకుంది. భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.