News

శ్రీకాళహస్తి అంతరాలయ దర్శనానికి 500

119views

శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేసే దిశగా అంతరాలయ దర్శనం టికెట్‌ను అమలు చేయాలని అధికారులు, ధర్మకర్తల మండలి నిర్ణయించింది. దర్శనార్థం వచ్చే భక్తులను అధికారుల అనుమతి లేకుండా యథేచ్ఛగా అంతరాలయ దర్శనాలకు తీసుకెళ్తున్నారు. అలా భక్తుల నుంచి వందల రూపాయలు నగదు దళారుల జేబుల్లోకి వెళ్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా రూ.500తో అంతరాలయ దర్శన టికెట్‌ను అందుబాటులోకి తేవాలని, ఈ టికెట్‌ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించారు. ఈ టికెట్‌ను భక్తులకు అందుబాటులోకి తేవడంలో అధికారులు మీనమేషాలు లెక్కించడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ టికెట్‌ అందుబాటులోకి వస్తే కొంతైనా దళారుల దందాకు అడ్డుకట్ట పడే అవకాశముంది. అంతేకాకుండా రద్దీ సమయాల్లో క్యూ లైన్లు నిలిచిపోకుండా సత్వరం భక్తులకు దర్శనమయ్యే అవకాశం ఉంటుంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టి.. అంతరాలయ దర్శన టికెట్‌ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.