News

నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

53views

ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు జరుగుతాయి. 15న ధ్వజారోహణం, 16న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, 17న సర్వభూపాలవాహనం, సింహవాహన సేవ, 18న కల్పవృక్ష, హనుమద్‌ వాహనాలు, 19న పల్లకీ పుష్పమండప వాహనం, రాత్రి కల్యాణోత్సవం, 20న తెల్లవారుజామున గరుడోత్సవం, మధ్యాహ్నం శేషవాహనం, రాత్రి గజ వాహనం, 21న మడుగుతేరు, బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 22న అశ్వవాహనం, 23న పుష్పమండపం, వసంతోత్సవం, హంస వాహనం, 24న దేవతా ఉద్వాసన, 25న పుష్పయాగోత్సవం, శయనోత్సవం (ఏకాంత సేవ)లు జరుపనున్నారు. ప్రారంభరోజు బుధవారం రాత్రి గజనాణ్యం పట్టు సాలెవారి ఆధ్వర్యంలో స్థానిక శమీ నారాయణస్వామి దేవాలయం నుంచి గరుత్మంతుని చిత్రపటంతో పురవీధులలో ఊరేగింపుతో లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయం చేరిన అనంతరం ధ్వజారోహణం జరుగుతుంది.