News

భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి : కుల్ భూషణ్ కేసులో పాక్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం

595views

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించే పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు గురువారం విచారించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు పాకిస్థాన్‌.. భారత్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ను జారీ చేసిందని ఆ దేశ అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావేద్‌ ఖాన్‌ కోర్టుకు తెలిపారు. జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించాలన్న పాకిస్థాన్‌ ప్రతిపాదనకు భారత్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వాదనలు విన్న ఇస్లామాబాద్‌ హైకోర్టు తమ ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాక్‌ ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్‌ మిలటరీ హైకోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.