
640views
జమ్మూకశ్మీర్లోని రజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి రజ్విందర్ సింగ్, అమృత్ సర్, పంజాబ్ వీరమరణం పొందారు. నియంత్రణ రేఖ వెంట పాక్ దళాల అనుమానాస్పద కదలికల్ని గుర్తించిన భారత సైన్యం తొలుత వారిని హెచ్చరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పాక్ దాడిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు వెల్లడించాయి. పాక్ శిబిరంలో కూడా ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చని సైనికాధికారుల అంచనా.





