News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు – భారీ ఉగ్ర కుట్ర భగ్నం

746views

మ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రకు యత్నిస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పర్వేజ్‌ అహ్మద్‌ భట్ (22), అల్తాఫ్‌ అహ్మద్‌ మీర్‌ (35), జీహెచ్‌ మహమ్మద్‌ (35), నజీముద్దీన్‌ గుజ్జర్‌ (44), అబ్దుల్‌ ఖయ్యుమ్‌ (29)గా గుర్తించారు. కుప్వారా జిల్లా లోలాబ్‌లోని లాల్‌పోరాలో ఉగ్రవాదులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈమధ్యే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడికి యత్నిస్తున్న ఆరుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.