440
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాల రావు గారి మృతిపై ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మికంగా లోకాన్ని విడిచివెళ్లిపోవడంపై వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుగారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ‍్యక్తం చేస్తున్నా. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత గల కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషి అభినందనీయం.”
“ఈరోజు ఉదయమే వారి కూతురు సింధుతో మాట్లాడి మాణిక్యాలరావుగారి ఆరోగ్యం గురించి వాకబు చేశాను. ఇంతలోనే ఇలా జరగడం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని ట్విట్టర్ ద్వారా వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు.