658
భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ మాణిక్యాల రావు 2014-2018 మధ్య కాలంలో చంద్రబాబు కేబినెట్‌లో ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.