
616views
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. తిరుపతిలో కంటైన్మైంట్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. కాగా శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఇతర ఉద్యోగులు కొందరికి కరోనా సోకిందన్న కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి, స్వామీ వారి నిత్య కైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహించాలని పలువురు హిందూ ధార్మిక వేత్తలు, సంస్థలు కోరుతున్న విషయం పాఠకులకు తెలిసినదే.





