
637views
మొదటి విడత రఫేల్ యుద్ధ విమానాలు జూలై చివరినాటికల్లా భారత్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ అనుకూలతను బట్టి జులై 29న అంబాలాలోని వైమానిక దళంలో ఐదు రఫేల్ విమానాలు చేరే అవకాశాలున్నట్లు భారత వైమానిక దళం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా దీనికి ఎలాంటి మీడియా కవరేజీ ఉండదని తెలిపింది. చివరి విడత విమానాలు ఆగస్టు 20 తర్వాత భారత్‌కు చేరనున్నట్లు పేర్కొంది. యుద్ధ విమాన సిబ్బంది వాటిని నడపడంతోపాటు వాటిలోని అధునాతన ఆయుధ వ్యవస్థను ఉపయోగించడంలో ఇప్పటికే శిక్షణ పొందారని స్పష్టం చేసింది. భారత్‌కు చేరిన రోజే వైమానిక దళంలోకి ఈ విమానాలు చేరనున్నాయి.





