News

గాల్వన్‌లో గాయపడిన సైనికులతో “రక్షా బంధన్‌” జరుపుకోనున్న జాతీయవాద సంస్థల మహిళలు

1.3kviews

ఏడాది రక్షా బంధన్‌ ముస్లిం రాష్ట్రీయ మంచ్, హిమాలయ పరివార్, భారత్ టిబెట్ సహ్యోగ్ మంచ్ వంటి జాతీయవాద సంస్థల మహిళలకు ప్రత్యేకమైనది.

ఈ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా భారతదేశ సరిహద్దులలోని సైనికులకు కృతజ్ఞతలు తెలపాలని యోచిస్తున్న మహిళలు ఈ బృందాలలో దేశవ్యాప్తంగా ఉన్నారు.

ఈ సంస్థల వ్యవస్థాపకుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీనియర్ కార్యకర్త శ్రీ ఇంద్రేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన సైనికులను సందర్శించడానికి ఈ సంస్థల మహిళలు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారని శ్రీ ఇంద్రేశ్ కుమార్ తెలిపారు. “వారు చైనా, పాకిస్తాన్ మరియు ఇతర దేశాల సరిహద్దులలో పని చేస్తున్న సైనికులను కూడా సందర్శించడానికి ప్రయత్నిస్తారు” అని ఆయన చెప్పారు.

“మేము లడఖ్కు ఒక బృందాన్ని పంపాలని అనుకుంటున్నాం. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న మహిళా కార్యకర్తలు ఉంటారు. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాత వారు అక్కడికి వెళ్తారు ”అని శ్రీ ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలోని సంస్థ భారత్, టిబెట్ సహయోగ్ మంచ్ ప్రధాన కార్యదర్శి శ్రీ పంకజ్ గోయల్ తెలిపారు.

కోవిడ్ -19 నేపథ్యంలో ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించి చిన్న చిన్న మహిళా కార్యకర్తల బృందాలు వారితో రక్షా బంధన్ జరుపుకునేందుకు సాయుధ దళాలు పనిచేసే ప్రాంతాలను సందర్శిస్తాయని శ్రీ ఇంద్రేశ్ కుమార్ చెప్పారు.

సరిహద్దుల్లో పని చేస్తున్న యూనిఫాంలో ఉన్న సైనికులకు యావత్తు దేశం పూర్తిగా మద్దతు ఇస్తుందని చూపించే ప్రయత్నంగా ఈ చర్యను ఇంద్రేశ్ కుమార్ అభివర్ణించారు.

“ఈ సంస్థల ప్రయత్నం మన సమస్యాత్మక సరిహద్దులను రక్షిస్తున్న భద్రతా దళాలపై దేశం యొక్క విశ్వాసాన్ని పునరుద్ఘాటించడమే” అని గోయల్ అన్నారు, మహిళా కార్యకర్తలు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్ లలోని సరిహద్దు ప్రాంతాలను సందర్శిస్తారని సమాచారం.

“సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి ‘రక్ష సూత్ర’ను కట్టాలి. ఈ చర్య ప్రతికూల పరిస్థితులలో కూడా దేశాన్ని రక్షిస్తున్న సైనికుల మనోధైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నాం.” అని శ్రీ ఇంద్రేశ్ కుమార్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.