News

దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్

503views

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కశ్మీర్‌ నుంచి నలుగురైదుగురు ఉగ్రవాదులు దిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు అనుమానిత ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చే అన్ని మార్గాల సరిహద్దుల్లో విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. దిల్లీలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర ప్రదేశాల్లో భద్రతాచర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.