News

కరోనా పాపం చైనాదే – WHO

938views

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం చైనాయేనని మొదటినుంచి ఆరోపిస్తున్న అమెరికా మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. వైరస్ ను వ్యాప్తి చేసింది ముమ్మాటికి డ్రాగన్ దేశమేననే అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యలతో ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO కూడా ఏకీభవిస్తోంది. తాజాగా WHO చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

కరోనా పాపం చైనాదేనని, వైరస్ సమాచారం ఇవ్వడంలో చైనా కావాలనే జాప్యం చేసిందని అమెరికా అధ్యక్షుడు మొదటినుంచి విమర్శిస్తూ వస్తున్నారు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తీవ్రంగా విఫలమైందని, WHO చైనా మాయలో నుంచి బయటపడాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే డ్రాగన్ మాయ నుంచి WHO బయట పడుతున్నట్లుగా కనబడుతోంది.

COVID – 19 జన్యు పరివర్తన క్రమాన్ని చైనా దురుద్దేశ్యపూర్వకంగానే ఆలస్యంగా బహిర్గతం చేసినట్లు WHO కూడా ఒప్పుకుంటూ ఉంది. ఈ సంచలన విషయాలను అసోసియేట్ ప్రెస్ బయటపెట్టింది. చైనాలోని ప్రయోగశాలలు ఎప్పుడో కరోనా జన్యు పరివర్తన క్రమాన్ని డీకోడ్ చేశాయి. కానీ వైరస్ నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ తయారీకి అవసరమైన వివరాలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొన్ని వారాల తర్వాత గానీ వెల్లడించలేదు. పైగా సమాచారం వెల్లడి కాకుండా కఠిన నిబంధనలను అమలు చేసిందనే ఆరోపణలున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.