News

2019 పుల్వామా దాడి పాక్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మేనల్లుడు ఇస్మాయిల్ హతం

653views

గ్రవాది ఇస్మాయిల్, అకా హతమయ్యాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారి మసూద్ అజార్ మేనల్లుడు అయిన ఫౌజీ భాయ్, జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇది భారత భద్రతా దళాలకు భారీ విజయం.

ఫిబ్రవరి 2019 పుల్వామా టెర్రర్ దాడిలో ఉపయోగించిన ఐఇడి (ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం) ను రూపొందించినది పాకిస్తాన్ ఉగ్రవాది ఇస్మాయిల్ అని సమాచారం.  ఇందులో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు – ఇది భారత సైనిక దళాలపై ఎప్పుడూ జరగనంత పెద్ద దారుణమైన దాడి.

అంతేకాకుండా, గత వారం పుల్వామాలో మరోసారి తెల్ల హ్యుందాయ్ సాంట్రో కారులో స్వాధీనం చేసుకున్న ఐఇడిని రూపొందించినది కూడా ఇస్మాయిలే అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇదే విధమైన మరో కారు-బాంబు దాడి కూడా విఫలమైనట్లు, జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.

తాము లోయలో జైషె ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో సాధించిన విజయాలను తెలియజేయడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సాయుధ దళాలు సంయుక్తంగా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించనున్నాయి.

Source : Republicworld.com

https://www.republicworld.com/india-news/law-and-order/masood-azhar-pakistan-terrorism-ismail-pulwama-terror-attack-forces.html?utm_source=izooto&utm_medium=push_notifications&utm_campaign=JaishTerrorCrushed&utm_content=&utm_term=

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.