News

News

ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది..

అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని...
News

ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్- ప్రయోగం ఎప్పుడంటే?

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకలో సునీతా విలిమయ్స్ మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్​తో కలిసి అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మే 7న(మంగళవారం) ఉదయం 8గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలో స్పేస్ లాంఛ్ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీతా విలియమ్స్ మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు. కాగా, తాము రోదసి యాత్రకు సిద్ధంగా ఉన్నామని సునీతా విలియమ్స్ తెలిపారు. ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. నాసా తన కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌ క్రాఫ్ట్‌ ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఇందులో సునీతా విలియమ్స్​తో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌ మోర్‌...
News

హిందుత్వం బలపడితే భయమెందుకు?

ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఇది ముమ్మాటికి సరికాదు. ఈ దేశ అస్తిత్వాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాలరాసే విధంగా మాట్లాడటం, వ్యంగంగా...
News

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం..

నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది....
News

సూర్యుడిపై రెండు భారీ సౌర తుపానులు

ప్రస్తుత 11 ఏళ్ల సౌర చక్ర కాలంలో సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించాయి. మే 2న తొలి తుపాను సంభవించగా...
News

ఏపీ కొత్త డీజీపీ గా హరీశ్ కుమార్ గుప్తా నియామకం

నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. కాగా, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన నేపథ్యంలో, ముగ్గురు సీనియర్ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను సిఫారసు చేసింది. అయితే, ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్...
News

దగ్గరకానున్న చైనా సరిహద్దు.. చమోలి- పితోర్‌గఢ్ రోడ్డు పనులు షురూ!

ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్‌ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది. 2028 నాటికి ఈ...
News

పూంచ్‌ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు

జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి...
1 1,503 1,504 1,505 1,506 1,507 3,061
Page 1505 of 3061