News

News

భక్తిశ్రద్ధలతో సావిత్రి అమావాస్య పూజలు

శ్రీకాకుళం జిల్లా పలాస రూరల్‌ మండలంలోని తర్లాకోట, పండాశాసనం, బ్రాహ్మణతర్లా, రెంటికోటల్లో గల ఒడియా బ్రాహ్మణ మహిళలు గురువారం వైశాఖ అమావాస్య పురస్కరించుకుని సావిత్రి అమావాస్య పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. పతి సౌభాగ్యం కోరుతూ జరిపే పూజల్లో ప్రధాన పూజగా...
News

రఘువీర్‌కు ‘వినూత్న రైతు’ అవార్డు

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన అభ్యుదయ యువరైతు నందం రఘువీర్‌కు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌ఐ) వినూత్న రైతు అవార్డు–2024ను అందజేసింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే) మేళాలో ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌ కమ్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఏకే సింగ్‌ ఈ అవార్డును రఘువీర్‌కు ప్రదానం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్‌ నుంచి అందుకున్న ఏకైక ఆదర్శ రైతుగా రఘువీర్‌ నిలిచారు. అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాలన్న సంకల్పంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్‌ కలిగిన వంగడాలు కూడా ఉన్నాయి. పెనమలూరులో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో తాను సేకరించిన పురాతన విత్తనాలతో విత్తన సంరక్షణ చేస్తున్నారు. ఎనిమిది...
ArticlesNews

శబ్దం చేసిన ఆనంద తాండవం

శబ్దం అంటే… ధ్వని మాత్రమే కాదు. అంతరంగాన్ని కదిలించే అద్భుత సాధనం. శబ్దం అంటే.. ఉచ్చారణ విధానం మాత్రమే కాదు.. శ్వాస నియంత్రణ ద్వారా యోగసాధన చేయించే మార్గం. శబ్దం అనంతశక్తికి నిలయం. విశ్వ ప్రతిస్పందనకు కేంద్రం. సమస్త వాఙ్మయ ఆవిర్భావానికి శబ్దమే మూలాధారం. అందుకే శబ్దం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అనంతమైన శబ్దశక్తితో శివుడినే కదిలించింది ‘శివతాండవ స్తోత్రం’. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అఖండమైన శివభక్తిని తనువులోని ప్రతి అణువులో నింపుకొన్నాడు రావణాసురుడు. ఇష్టదైవం పరమేశ్వరుడిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఓ రోజు కైలాసానికి చేరుకున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా శివుడు కరుణించలేదు. మొత్తంగా కైలాసపర్వతాన్నే పెకలిస్తానంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అనుకున్నదే తడవుగా తన ఇరవై చేతులతో కైలాసపర్వతాన్ని పెళ్లగించటం ప్రారంభించాడు. విశ్వమంతా చేష్టలుడిగి చూసింది. పరమేశ్వరి కూడా విస్తుపోయింది. శివుడు మాత్రం ఏమీ పట్టనట్టు ఆనంద తాండవం...
News

చంద్రుని ఉపరితలంపై అద్భుతం..సోలార్ విండ్ అయాన్ల ఉనికి

చైనా ఇటీవల చంద్రునిపై పరిశోధనలకోసం దక్షిణ ధృవం పైకి పంపిన Change-6లోని ల్యాండర్ కొన్ని సోలార్ విండ్ అయాన్లను గుర్తించింది. వాస్తవానికి చంద్రుని దక్షిణ ధృవంపై మట్టి, రాళ్ల నమూనాను సేకరించి తిరిగి భూమికి పంపేందుకు ప్రయోగించారు. ఇది చంద్రునిపై మట్టి,...
News

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర

దక్షిణ మధ్య రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు ప్రయాణికుల నుండి వచ్చిన భారీ స్పందనను స్పూర్తిగా తీసుకొని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సికింద్రాబాద్ నుండి మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ సర్క్యూట్...
News

స్వర్ణదేవాలయంలో ఖలిస్థాన్‌ నినాదాలు

పంజాబ్‌లో మరోసారి వేర్పాటువాద ఖలిస్థాన్‌ అంశం తెరపైకి వచ్చింది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అక్కడ భారీ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న వివిధ సంస్థల కార్యకర్తలు...
NewsSeva

పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువ చాటిన సంఘమిత్ర చిన్నారులు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంఘమిత్ర సేవా సమితి,నంద్యాల ఆధ్వర్యంలో సంఘమిత్ర చిన్నారులు, నంద్యాల నంది మండలం గా ప్రసిద్ది కెక్కడానికి ప్రతీకలైన నవనందులలో మొదటిదైన ప్రథమ నందీశ్వర స్వామి ఆవరణలో ఉన్న చెత్తా చెదారాన్ని, ముళ్ళు పొదలను శుభ్రం చేసి పర్యావరణం పట్ల తమ మక్కువను చాటడంతో పాటు, ఆ దేవ దేవుని పట్ల తమ భక్తిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు సంఘమిత్ర అధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సహకార్యదర్శి సుందర్ రావు, కార్యవర్గ సభ్యుడు రమణయ్య గౌడు, ఆవాసం ప్రముఖ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని మా ఇంట్లోనికి రానివ్వం అలాగే పర్యావరణ దినోత్సవం సందర్బంగా నంద్యాలలోని స్థానిక వాసవీ పారడైస్ అపార్ట్ మెంటులో ప్రకృతి పరిరక్షణపై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా ప్లాస్టిక్ నిరోధం, నిషేధం, పునరుత్పత్తి...
News

కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో ఢిల్లీకి అమెరికా ప్రతినిధి

కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం అమెరికా ప్రయత్నాలను మొదలుపెట్టింది. తమ దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాక్‌ సలీవాన్‌ను భారత్‌ పంపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫోన్‌ చేసిన సందర్భంగా...
1 1,449 1,450 1,451 1,452 1,453 3,069
Page 1451 of 3069