News

News

అయోధ్య ఫలితంపై ‘రామాయణ్’ నటుడు

శ్రీరాముడి జన్మభూమి అయోధ్య క్షేత్రం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి ఓటమిపాలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కమలం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ దళిత నేత అవధేశ్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. ఈ ఫలితంపై ‘రామాయణ్‌’ ధారావాహికలోని లక్ష్మణ పాత్రధారి సునీల్‌ లాహ్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఈ ఎన్నికల ఫలితాలు (తీవ్రంగా నిరాశపర్చాయి. నాడు అరణ్యవాసం నుంచి తిరిగొచ్చిన తర్వాత అయోధ్యలో సీతాదేవిని శంకించిన విషయాన్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. స్వయంగా దేవుడే ప్రత్యక్షమైనా వారు ఆయనను తిరస్కరిస్తారు. అయోధ్య ఎప్పుడూ నిజమైన రాజుకు ద్రోహం చేస్తూనే ఉంది. ఆనాడు సీతాదేవినే వదల్లేదు. అలాంటిది.. ఇప్పుడు శ్రీరాముడిని...
News

బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో తొలి మరణం.. నిర్ధారించిన డబ్ల్యూహెచ్‌వో

బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడింది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. డయేరియా, వాంతుల లాంటి లక్షణాలతో...
News

అంతరిక్షంలో వెయ్యి రోజులు.. రష్యా వ్యోమగామి ఒలెగ్‌ రికార్డు

అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు. ఒలెగ్‌ కొనొనెన్కో(59) 2008 నుంచి ఐదుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. మంగళవారం నాటికి ఆయన వెయ్యి రోజుల పాటు అంతరిక్షంలోనే నివసించారు. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగామిగా ఒలెగ్‌ రికార్డు సృష్టించారని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్‌ బుధవారం ప్రకటించింది. 2024 సెప్టెంబర్‌ 23 వరకు ఆయన అంతరిక్షంలోనే ఉండనున్నారు. అప్పటికి 1,110 రోజులు అంతరిక్షంలో ఉన్నట్టు అవుతుంది. కాగా, ఒలెగ్‌ తర్వాత 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకన్ల పాటు అంతరిక్షంలో ఉన్న రికార్డును రష్యాకే చెందిన గెన్నడీ పడల్క 2015లో సృష్టించారు....
News

పర్యావరణాన్ని కాపాడేందుకు భారత నౌకాదళం కృషి

ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని భారత నౌకాదళం పునరుద్ఘాటించింది. బుధవారం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా భూ పునరుద్ధరణ ఎడారీకరణ నిరోధం, కరువు సమయాల్లో పటిష్టంగా పనిచేసే వ్యవస్థలు అనే ఇతివృత్తానికి అనుగుణంగా తాము పని...
ArticlesNews

తోలు బొమ్మలకు జీవం

తోలు బొమ్మలు పేరెత్తగానే ఠక్కున గుర్తొచ్చేది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నిమ్మలకుంట గ్రామమే. ఇక్కడి కళాకారులు తోలుతో చేసిన కళాకృతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పలు దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. తోలుబొమ్మల కళాకారులు పలు భాషలు మాట్లాడడమే కాకుండా ఇతర దేశాల వారికి కూడా శిక్షణ ఇస్తున్నారంటే వీరి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అనంత కీర్తిని అమెరికా దాకా తీసుకెళ్లిన నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులు నిత్యం కొత్త బొమ్మల తయారీలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాలానికి అనుగుణంగా తోలుబొమ్మలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ల్యాంప్‌సెట్స్‌, గోడలకు వేలాడదీసే బొమ్మలు, బ్యాగులు, గోడ గడియారాలు తదితర వాటిని తయారు చేస్తున్నారు. 80 కుటుంబాలకు ఉపాధి.. ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో నిమ్మలకుంట ఉంది....
News

హిమాలయాల్లో విషాదం, ముమ్మరంగా సహాయ చర్యలు

హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ నలుగురు ప్రాణాలు వదిలారు. సహస్రతల్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్...
ArticlesNews

శ్రీవారి అభిషేకానికి పాలు సేకరించేది ఇక్కడే..! రోజుకు ఎన్ని లీటర్లు అవసరమంటే..!

శ్రీవారికి వివిధ రకాలైన పూజలు, కైంకర్యాలు నిత్యం జరుగుతాయి. ఈ కైంకర్యాల్లో కల్తీలేని స్వచ్ఛమైన పదార్థాలనే వినియోగిస్తారు. వీటన్నింటిల్లోకెల్లా ముఖ్యమైనవి గోవుపాలు. శ్రీవారి కైంకర్యాలలో స్వచ్ఛమైన గోవు పాలు వినియోగించాల్సిందే. మన దేశంలో అందుబాటులో ఎన్నో రకాలసంకర జాతుల ఆవులు ఉన్నాయి. కానీ స్వామి వారి నైవేద్య నివేదనకు., స్వామి వారి కైంకర్యాలు నిమిత్తం టీటీడీ శ్రీవెంకటేశ్వర గో సంరక్షణ శాలను స్థాపించింది. తిరుపతి- చంద్రగిరి గిరి మార్గంలోని తుమ్మలగుంటకు సమీపంలో 1956వ సంవత్సరంలో ఈ గో సంరక్షణ శాలను టీటీడీ ప్రారంభించింది. స్వామి వారికీ నిత్య సేవలైన సుప్రభాతం సేవలో నవనీతం (వెన్న), తోమాల సేవలో (పాలు), ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణ శాలలో ఉత్పత్తి చేస్తుంది. రోజుకు సుమారు తొమ్మిది వందల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. దేశవాళీ...
News

అయ్యో పాపం.. ఇంకేమి పుణ్యస్నానం..?

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఇంద్రపుష్కరిణి ఆధునికీకరణ ప్రతిపాదన అటకెక్కింది. నిధులు అందుబాటులో ఉన్నా.. పాలనా అనుమతులు పొందినా.. టెండర్లు సైతం ఖరారైనా వైకాపా అయిదేళ్ల పాలనలో పనులు ప్రారంభించలేకపోయింది. మూడేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ హడావుడి చేసి కాలం...
1 1,450 1,451 1,452 1,453 1,454 3,069
Page 1452 of 3069