NewsSeva

పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువ చాటిన సంఘమిత్ర చిన్నారులు

179views

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంఘమిత్ర సేవా సమితి,నంద్యాల ఆధ్వర్యంలో సంఘమిత్ర చిన్నారులు, నంద్యాల నంది మండలం గా ప్రసిద్ది కెక్కడానికి ప్రతీకలైన నవనందులలో మొదటిదైన ప్రథమ నందీశ్వర స్వామి ఆవరణలో ఉన్న చెత్తా చెదారాన్ని, ముళ్ళు పొదలను శుభ్రం చేసి పర్యావరణం పట్ల తమ మక్కువను చాటడంతో పాటు, ఆ దేవ దేవుని పట్ల తమ భక్తిని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు సంఘమిత్ర అధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సహకార్యదర్శి సుందర్ రావు, కార్యవర్గ సభ్యుడు రమణయ్య గౌడు, ఆవాసం ప్రముఖ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ భూతాన్ని మా ఇంట్లోనికి రానివ్వం
అలాగే పర్యావరణ దినోత్సవం సందర్బంగా నంద్యాలలోని స్థానిక వాసవీ పారడైస్ అపార్ట్ మెంటులో ప్రకృతి పరిరక్షణపై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా ప్లాస్టిక్ నిరోధం, నిషేధం, పునరుత్పత్తి గురించి సుధీర్ఘంగా చర్చించారు.పర్యావరణ రిరక్షణ విజయ గాథల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సంఘమిత్ర వ్యవస్థాపకులు డాక్టర్ ఉదయ శంకర్, డాక్టర్ సత్య శివ సుందరి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సహ కార్యదర్శి సుందర్ రావు, కార్యవర్గ సభ్యులు జయశ్రీ, వెంకటేశ్వరి, మాతృ మిత్ర ప్రముఖ్ సంధ్య, శ్యామల, వెంకటయ్య, ఆవాస్ ప్రముఖ్ గంగాధర్, సేవా ప్రముఖ్ శ్రీనివాస్ లతో పాటుగా 20 మంది అపార్ట్ మెంటు మహిళలలు పాల్గొన్నారు.