శివాజీ అనుచరుల్లో నేతాజీ పాల్కర్ ఒకడు. పురందర్ కోటకు సంరక్షకుడుగా ఉండేవాడు. అలాంటివాడిని లొంగదీసుకుంటే శివాజీ కుంగిపోతాడని భావించి ఔరంగజేబు తన సేనాని దిలావర్‌ఖాన్‌ను పంపి మోసపూరితంగా పాల్కర్‌ను బందీని చేశాడు. అంతేకాదు అతని మతంమార్చి మహ్మద్ కులీఖాన్ అని పేరు...
భారతదేశానికి భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ఉష్ణతాపంతో వరదలు, కరవు, వడగాలులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు రోగాలు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని సర్వేలో...
తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా జైనూరులోని వడ్డెర బస్తీలో మే 13న సుమారు 7వందల మంది ముస్లింల గుంపు స్థానిక గిరిజనులపై ఇనపచువ్వలు, కర్రలతో దాడి చేసి వారిని భయభ్రాంతులను చేసారు. వారి దాడిలో ఒక గిరిజన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిప్పుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే, అయినా నిలకడగానే ఉంది. ఆ సంఘటనపై శ్రీ గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ కమిటీ తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని జిల్లా ఎస్పికి పంపించింది. గిరిజనుల భూముల్లో నివసిస్తున్న గిరిజనేతరుల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించాలన్న డిమాండ్‌తో జిల్లా కలెక్టర్‌ను, ఉన్నతాధికారులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మే13 దాడి ఘటనలో దోషులపై తక్షణం చర్య తీసుకోవాలనీ, వారిని కఠినంగా శిక్షించాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 7వందల మంది ముస్లిములు కలిసి...
మణిపూర్ రాష్ట్రంలో కుకీ నేషనల్ ఫ్రంట్ (మిలటరీ కౌన్సిల్) అనే కుకీ తీవ్రవాద సంస్థ ఒక పర్వత ప్రాంతాన్ని ఆక్రమించి, దాని పేరు మార్చేసింది. ఆ పర్వత ప్రాంతం మెయితీ తెగవారి పవిత్ర ప్రార్థనా ప్రదేశం కావడంతో వివాదం చెలరేగింది. మణిపూర్ ప్రభుత్వం కుకీ తీవ్రవాద సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా థాంగ్జింగ్ చింగ్ పర్వతప్రాంతాన్ని కుకీ నేషనల్ ఫ్రంట్ ఆక్రమించింది. అక్కడ ‘కుకీ ఆర్మీ క్యాంప్’ అని బోర్డు తగిలించింది. నిజానికి ఆ పర్వతం ‘సనమహిజం’ అనే మతధర్మాన్ని పాటించే మెయితీ తెగ వారి పవిత్ర పుణ్యక్షేత్రం. కుకీ ఆర్మీ క్యాంప్ అన్న బోర్డు తగిలించిన ఫొటో స్థానికంగా విస్తృత ప్రచారంలోకి రావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. మణిపూర్ భూవనరుల అధికారి మంగోలియావో కేమే, ఇంఫాల్ పోలీస్ స్టేషన్ అధికారికి...
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రధాన ఆలయ శిఖరంలోని సగభాగానికి స్వర్ణతాపడం పనులు వేగవంతం చేశారు. ఎప్పటి మాదిరే స్వర్ణతాపడం పనులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అప్పగించారు. ఆలయ పైభాగం స్వర్ణతాపడాన్ని గతంలో టీటీడీనే నిర్వహించింది. దీనికి తగిన బంగారాన్ని, సంబంధిత పనులకుగాను...
ఖగోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక 'షా ప్రైజ్’ భారత సంతతి శాస్త్రవేత్తను వరించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తది తర అంశాల్లో కనుగొన్న విషయాలకుగానూ అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్.కులకర్ణికి ఈ అవార్డు లభించిందని షా ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. కులకర్ణి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్. ఆయనతో పాటు మెడిసిన్, లైఫ్ట్సైన్స్ విభా గంలో స్వీ లే థీయెన్, స్టువర్ట్ ఆర్కిన్ సంయుక్తంగా 'షా ప్రైజ్‌ను గెలుచుకున్నారు. గణితశాస్త్రంలో పీటర్ సార్నక్ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ అమెరి కాకు చెందినవారే. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి సుమారు రూ.10 కోట్లు (12 మిలియన్ డాలర్లు) బహు మతిగా అందనున్నాయి....
వివేక్ రామస్వామి.. అమెరికాలో స్థిరపడిన భారతీయుడు. పోనీ భారతీయ సంతతికి చెందినవాడు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు. ఈసారి అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేద్దామనుకుని, పరిస్థితి అనుకూలించక మొన్న జనవరిలో ప్రచారం నిలిపివేశారు. నిజం చెప్పాలంటే అమెరికాలో ఇప్పటికీ చాలావరకు ప్రభావం చూపుతున్న...
కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి సన్నిధి వేదఘోషతో పులకించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేదాలలో నిష్ణాతులైన పండితులు తమ వేదవిద్యను స్వామివారి పాదాలచెంత ఉంచి పునీతులయ్యారు. స్వామివారి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా పండిత సదస్యం అత్యంత ఘనంగా జరిగింది. నవవధూవరులైన...
వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భవానీదీక్షలు, దసరా నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వస్తున్నారు. మండే ఎండలను లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీంతో రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం జమ అవుతోంది. ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కనకదుర్గానగర్‌లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్ స్థలం కొరత ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఈవో కేఎస్ రామారావు తెలిపారు....