166views
ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఛావా’. ఈ చిత్రంలో శంభాజీ పాత్రను విక్కీ కౌశల్ చేస్తున్నారు. తండ్రి శివాజీలానే శంభాజీని కూడా ధర్మవీర్ అని గౌరవించేవారు. అలాంటి గొప్ప పాత్ర కావడంతో ఫిజికల్ మేకోవర్ పరంగా, నటన పరంగా విక్కీ కౌశల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ మూవీలో శంభాజీ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన విక్కీ కౌశల్ లుక్ లీకై, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




