
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేట్, లింపియాధురా, కాలాపానీలతో కూడిన కొత్త పటం చోటుచేసుకోనుంది. ఈ పరిణామంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కృత్రిమ విస్తర ణతో కూడిన ఏకపక్ష చర్యగా పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రధాని
పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి రూ. వంద నోట్లపై నేపాల్ పాతపటం స్థానంలో కొత్తపటం ముద్రణకు నిర్ణయం తీసుకొన్నట్లు ఆ దేశ సమాచార, ప్రసారశాఖ మంత్రి రేఖాశర్మ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా నేపాల్ 2020 జూన్లో రాజ్యాంగ సవరణ కూడా చేసింది. సరిహద్దులో వ్యూహాత్మకంగా కీలకమైన పై మూడు భూభాగాలు తమకు చెందినవిగా భారత్ పరిగణిస్తోంది. సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్.. అయిదు భారత రాష్ట్రాలతో నేపాల్ 1,850 కి.మీ.ల సరిహద్దును పంచుకుంటోంది





