News

ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం

69views

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. మే 12న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ‘శ్రీభాష్యం’ పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భాష్యకారుల ఉత్సవాల మొదటి రోజు శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి పాల్గొన్నారు.