
ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతున్న వేళా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న గణంకాలే ఇందుకు నిదర్శనం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 50 మంది ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు అర్పించారని, మరో 9 మంది సాధారణ పౌరులు సైతం మృతిచెందారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాదిలో గడిచిన 4 నెలల్లో వివిధ ఘటనల్లో 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మరణించిన వారిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన టాప్ కమాండర్లు ఉన్నారని చెప్పారు. 9 మంది పౌరులు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారని చెప్పారు. 2019లో మొత్తం 160 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. 102 మంది అరెస్టయ్యారు.





