News

18న ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

42views

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్‌ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.

  • 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతుంది.
  • 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన కోటా అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదలవుతుంది.
  • 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్‌ కోటా విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది.