
27views
భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనుంది. అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియక ముందే సీడీఎస్‌గా ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీడీఎస్ పదవీకాలం ముగిసిన వెంటనే రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు. దీనితోపాటు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు తీసుకోనున్నారు.





