News

పైడితల్లి ఉత్సవాలకు అంకురార్పణ

267views

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలి ఘట్టమైన పందిరి రాట మహోత్సవం వేడుకగా సాగింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.శిరీష ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు చదురుగుడి, 11 గంటల సమయంలో వనంగుడి ప్రాంగణంలో రాటలు వేశారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ క్రతువు పూర్తయింది. అంతకుముందు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు చదురుగుడిలో తల్లికి మాలధారణ చేపట్టారు. పలువురు భక్తులు దీక్ష వస్త్రాలు అందుకున్నారు. ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ రాష్ట్ర పండగగా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఆలయాభివృద్ధి పనులను రూ.1.80 లక్షలతో చేపడతామని చెప్పారు. తలయారి చిన పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.