News

అస్సాంలోని ధుబ్రిలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు పొడగింపు

242views

రానున్న దుర్గాపూజ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడానికి అస్సాంలోని రాష్ట్రంలోని ధుబ్రి దక్షిణ సల్మారా జిల్లాల్లో ఎవరైనా అల్లర్లు సఈష్టించాలని ప్రయత్నిస్తే కనిపిస్తే కాల్చివేత ఆదేశం అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు, . భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో పెరుగుతున్న భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆదేశాన్ని అక్కడ మతహింస చెలరేగిన కారణంగా మొదట జూన్ 13న అమలులోకి తెచ్చారు, అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతోంది. తాజాగా దుర్గా పూజ అయ్యేవరకు ఆ ఆదేశాలను పొడగించారు ధుబ్రి , దక్షిణ సల్మారాలో కొన్ని అనుచిత కార్యకలాపాలు జరుగుతున్నాయని భద్రతా సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ రెండు జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకొని ఉన్నాయి అక్కడి నుండి ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని నివేదికలు వెల్లడించాయి. అందువల్ల వాటిని సున్నితమైనప్రాంతాలుగా గుర్తించింది ప్రభుత్వం.

దుర్గా పూజ సమయంలో రాత్రిపూట ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే, వారిపై కాల్పులు జరపాలని ఆదేశించడం మునుపటిలాగే కొనసాగుతుందని హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలు సురక్షితమైన వాతావరణంలో పండుగ జరుపుకునేలా శాంతిభద్రతలను కాపాడటానికి మాత్రమే ఈ చర్య అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అలాంటి ఆందోళన లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

బెదిరింపు కాల్స్
ధుబ్రీ జిల్లాలోని కొంతమందికి బంగ్లాదేశ్ నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. సరిహద్దు అవతల నుండి ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాల్స్ చేస్తున్నారని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కాల్స్ వెనుక అలీ హుస్సేన్ బెపారి అనే వ్యక్తి ఉన్నాడని దర్యాప్తులో తేలింది. అతన్ని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడు. పోలీసుల ప్రకారం, అలీ హుస్సేన్ స్థానిక ప్రజల ఫోన్ నంబర్లను బంగ్లాదేశ్‌కు పంపాడని, అక్కడి నుండి కాల్స్ వచ్చాయని తెలిపారు. అంతర్గత భద్రతను ఉల్లంఘించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుసింది. సరిహద్దు అవతల నుండి కాల్స్ ఎలా చేయవచ్చో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. అలీ హుస్సేన్ గతంలో జైలుకు వెళ్లాడని, అతనికి నేర చరిత్ర ఉందని ముఖ్యమంత్రి అన్నారు. అతను ఇప్పటికే అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఈసారి అతని అరెస్టు వల్ల అనేక షాకింగ్ విషయాలు తెలిశాయి