News

ఓనం వేడుకలకు దూరంగా ఉండమని చెప్పిన టీచర్…కేసు నమోదు చేసిన పోలీసులు

172views

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మత సామరస్యాన్ని దెబ్బతీసినందుకుగానూ ఒక ఉపాధ్యాయురాలిపై కేసు నమోదైంది. ముస్లిం విద్యార్థులను ఓనం వేడుకలకు దూరంగా ఉండమని విద్యార్థులకు వాయిస్ మెసేజ్ లో చెప్పినందుకు గానూ పాఠశాల యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే త్రిస్సూర్ జిల్లాలోని కున్నంకుళం సమీపంలోని కడవల్లూరులోని సిరాజుల్ ఉలూమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉపాధ్యాయరాలుగా పనిచేస్తున్న ఖాదీజా. . ముస్లిం విద్యార్థులు ఓనం వేడుకలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపించింది. ముస్లిం విద్యార్థులు పాఠశాల వేడుకల్లో పాల్గొంటే అది షిర్క్ అవుతుందని టీచర్ చెప్పింది.

షిర్క్ అంటే ఒకటి కంటే ఎక్కువ దేవుళ్లను నమ్మే నమ్మకాన్ని సూచిస్తుంది. మలయాళ టీవీ ఛానెల్‌లు కూడా ఆఆడియో సందేశాన్ని ప్రసారం చేశాయి, అందులో టీచర్ పిల్లలు , వారి తల్లిదండ్రులతో, “మనం ముస్లింలు ఇస్లాంను అనుసరించి మన జీవితాలను గడపాలి. ఓనం హిందూ పండుగ. ఈ వేడుక బహుదేవతారాధనపై ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రోత్సహించకూడదు. మరొక మతం ఆచారాలలో పాల్గొనడం ‘షిర్క్’గా మారవచ్చు” అని చెప్పారు. దాంతో మతసామరస్యాన్ని దెబ్బతీసినందుకు గానూ ఆ ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ నిర్ణయం పాఠశాల యాజమాన్యమే తీసుకున్నట్లు ఖదీజా బుకాయించింది. అయితే, అది ‘ఖదీజా వ్యక్తిగత అభిప్రాయమని పాఠశాలయాజమాన్యం మీద తోస్తుందని అని చెబుతూ యాజమాన్యం దానికి దూరంగా ఉంది. ఆ టీచర్ ను సస్పెండ్ చేసింది. ఈ విషయంపై డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) నాయకుడు హసన్ ఫిర్యాదు మేరకు ఖదీజాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కున్నంకుళం సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జయప్రదీప్ కెజి తెలిపారు. ఇతర మతాల పండుగల్లో పిల్లలు పాల్గొనకుండా నిరోధించాలని తల్లిదండ్రులను కోరుతూ ఇలాంటి సందేశాన్ని ప్రచారం చేసిన మరో ఉపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి స్పందాంచారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన అన్నారు.

“చిన్న పిల్లల మనస్సుల్లో ఉపాధ్యాయులు విభేదాలు సృష్టించకూడదు. ప్రభుత్వం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది, మేము డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్‌ను నివేదిక ఇవ్వాలని కోరాము. ఆ పాఠశాలలో ఓనం పండుగ జరుపుకునేటప్పుడు, విద్యా శాఖ ఉద్యోగులు అక్కడ ఉంటారు” అని ఆయన అన్నారు.