News

తిరుమల నంబి 1052 అవతార మహోత్సవాలు

282views

ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత చ‌రిత్రపై ఉపన్యసించారు. భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు, శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారని పేర్కొన్నారు. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వర‌ స్వామి వారి అభిషేకానికి పవిత్రజలాలను తీసుకొచ్చి విశేష సేవ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్‌ అధికారి శ్రీ రాజగోపాల్, ఇతర పండితులు, అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.