News

ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలకు మాజీ సైనికుడి తోడ్పాటు

651views

వైకల్యం అనేది సహజ సిద్ధంగా ఏర్పడే నిర్మాణమే కానీ లోపం కాదని, వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులను అక్కున చేర్చుకొని ఆదరించాలే కానీ వారిని చూసి జాలి పడకూడదని, వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి వెన్ను తట్టి ప్రోత్సహిస్తే దివ్యాంగులు కూడా ఉన్నత స్థితికి చేరుకుంటారని కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల జాతీయనిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు వెన్నపూస శ్రీ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. గురువారం నాడు స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేంద్రీయ కర్మాగార రక్షణ దళంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసి పదవీ విరమణ చేసిన శ్రీ నోటు మాల్యాద్రి రెడ్డి పాఠశాల మౌలిక వసతుల కోసం సమకూర్చిన 10 ట్యూబ్ లైట్లను, 2 సీలింగ్ ఫ్యాన్లను, దోమల నియంత్రణ కోసం తెరలను ఎంపీడీఓ శ్రీమతి స్వరూపా రాణి గారికి అందజేశారు.

ఈ సందర్బంగా శ్రీమతి స్వరూపా రాణి మాట్లాడుతూ సేవ చేయటంలోనే నిజమైన ఆనందం ఉందని, దివ్యాంగ విద్యార్థుల బాగోగుల కోసం వసతులు సమకూర్చడం ద్వారా మాల్యాద్రి గారు పలువురికి ఆదర్శనీయులయ్యారని, సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులందరికీ స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ వింజమూరు కన్వీనర్ క్రిష్ణారెడ్డి, మల్లం కొండా రెడ్డి, మూలా బాలకృష్ణా రెడ్డి, మౌనిక, ప్రత్యేక ఉపాధ్యాయులు మధు, కరీం బాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.