News

రాజమహేంద్రవరంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ

163views

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ABVP) రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో జులై 9 ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ ( జాతీయ విద్యార్థి దినోత్సవం) సందర్భంగా 15వందల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విబాగ్ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ జాతీయత ఊపిరిగా జాతీయ పునః నిర్మాణమే లక్ష్యంగా చేసుకుని విద్యార్థి పరిషత్ గత 77 సంవత్సరాలుగా దేశం కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యారంగ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉందని, సాధారణ కార్యకర్తలను సైతం ఉత్తమమైన నాయకత్వ లక్షణాలుగా తయారు చేయగల సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని అన్నారు. వివేకానందుని మాటలని స్ఫూర్తిగా జ్ఞానశీల ఏకతలే ప్రత్యేకతలుగా చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థినిలో దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థి పరిషత్ పనిచేస్తుందన్నారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఆదర్శంగా చేసుకుని నిత్యం కూడా జనంలోనీ జ్యోతులుగా జాతి కోసం వెలుగగా అనునిత్యం పనిచేస్తుంటుంది అఖిల భారత విద్యార్థి పరిషత్ మాత్రమే అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ,బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.