News

ధర్మాన్ని అనుసరిస్తే దైవానుగ్రహం

22views

చిన్నతనం నుంచే పిల్లలను ధర్మపాలన వైపు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్మాత్మిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. పార్వతీపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ప్రయోక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలకు  ఆయన హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మాట్లాడారు. ‘శాస్త్రం, గురువు ఏది చెబితే అదే సత్యం. ధర్మాన్ని అనుసరించేవారిని భగవంతుడు కాపాడతాడు. భాగవతం, రామాయణం ధర్మం గురించే వివరించాయి. తిరుమల వేంకటేశ్వరుని ముఖారవిందం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని అక్కడి వేదపండితులు చెబుతారు. ధర్మాన్ని ఆచరించే వ్యక్తి దర్శనానికి వెళ్తే స్వామి ముఖం వెలిగిపోతుందని, ఆ వ్యక్తి కొండ దిగి వెళ్లిపోయేటప్పుడు కొంత విచారంతో ఉంటుందని అక్కడివారు చెప్పారు. అది ముమ్మాటికీ నిజం. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించి స్వామికృపను పొందాలి’ అని చాగంటి ఆశీర్వదించారు.

అనంతరం చాగంటి కోటేశ్వరరావును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్, జిల్లా న్యాయమూర్తి దామోదరరావు, శతాబ్ది ఉత్సవాల కమిటీ సభ్యులు సీహెచ్‌ బాలగంగాధర్‌ తిలక్, ప్రధాన అర్చకులు ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాధవరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.