
27views
వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి శుక్రవారం రెండవ విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇప్పటికే సిబ్బంది మూడు మణుగుల గంధాన్ని (సుమారు 120 కిలోలు) అరగదీసి సిద్ధం చేశారు. ఇందులో గురువారం అర్చకులు సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి స్వామికి సమర్పించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. శుక్రవారం వేకువజామున 2.30 గంటలకు స్వామిని మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. అనంతరం చందన సమర్పణ చేస్తారు. వైదిక కార్యక్రమాల పూర్తయిన తర్వాత స్వామి, అమ్మవార్లను ఆలయ ఆస్థాన మండపంలో కొలువుదీర్చి విశేష స్నపన తిరుమంజనం, శీతల నివేదనలు సమర్పించారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. చందన సమర్పణ నేపథ్యంలో సుప్రభాత సేవ, ఉదయం ఆరాధన, ఇతర ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.





