
తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడిలో సహాయ కార్యనిర్వహణ అధికారి(ఏఈఓ)గా పనిచేస్తున్న ఎ.రాజశేఖర్ బాబును సస్పెండ్ చేసినట్లు టిటిడి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని చర్చిల్లో జరిగే ప్రార్థనల్లో ప్రతి ఆదివారం ఆయన పాల్గొంటున్నట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు రావడంతో తితిదే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. టిటిడిలో పనిచేస్తూ అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్న ఏఈవో స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. తితిదేలో ఇప్పటికే అన్యమతస్థులు 47 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరుకాక అనధికారికంగా మరో 375 మంది ఉన్నట్లు విజిలెన్స్ నివేదికలు చెబుతున్నాయి.
దీనిపై రాధామనోహర్ దాస్ కూడా స్పందించారు. టీటీడీలో పని చేస్తూ స్వామి సొమ్ము తింటూ, హుండీలో హిందువులు కానుకలు సమర్పిస్తే. దాంతో జీతం తీసుకుంటూ చర్చి లకు వెళ్లే ఉద్యోగులు చర్చిలను వదిలేయాలని, లేకుంటే టీటీడీని వదిలేయాలని మీడియా ఎదుట డిమాండ్ చేయడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. రాజశేఖర బాబు చర్చికి వెళ్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణలో కూడా తేలింది. దీంతో ఆయన్న సస్పెండ్ చేసి నట్టు టీటీడీ మంగళవారం ప్రకటించింది. ‘రాజశేఖరబాబు టీటీడీ ఉద్యోగిగా సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. టీటీడీ విజిలెన్స్ నివేదిక, ఇతర ఆధారాలను పరిశీలించి, ఆయనపై శాఖాపరమైన చర్యలతో పాటు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నాం’ అని టీటీడీ పేర్కొంది..





