
పుణ్య శ్లోక అహిల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి వేడుకలు సందర్బంగా శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వై జంక్షన్ నుండి మంజీరా వరకు ర్యాలీ నిర్వాహంచారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంకు ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం అరుణ్ సాహో, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బిజెపి నాయకులు, మహిళలతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంజీరాలో పుణ్య శ్లోక అహిల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి నిర్వహించారు.
ఈ సందర్బంగా ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం అరుణ్ సాహో మాట్లాడుతూ, రాజమాతగా అహిల్యా బాయి చూపిన ధైర్యం, దార్శనిక, ధార్మిక పాలన, ప్రజల పట్ల నిస్వార్థ ప్రేమ, ఆర్థిక సామాజిక మహిళా సాధికారత, సాంస్కృతిక పునరుద్ధరణ, దూర దృష్టి కలిగిన ప్రజాపాలన కొనియాడదగినవని అన్నారు. ఈమె జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు .





