
నిస్వార్థ ప్రజా సేవకురాలు పుణ్య శ్లోక లోక్ మాతా అహిల్యబాయి హోల్కర్ అని బీజేపీ సీనియర్ నేత మధుకర్ జీ అన్నారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్. రజనీ అధ్యక్షతన అహిల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ నేత మధుకర్ జీ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఎందరో మహానుభావులు అలుపెరుగని పోరాటాలు చేశారని అందులో అహిల్యా బాయి హోల్కర్ ఒకరని అన్నారు. ఆమె దేశ సాంస్కృతిక వైభవానికి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఝాన్సీ లక్ష్మీబాయి తరహాలో యుద్దాలు చేసి అమాయక ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలుస్తారని అన్నారు. ఆమె చరిత్ర సాధించిన విజయాల మనకు ఆదర్శవంతమైనవి అన్నారు. 3000 దేవాలయాలు 200 ప్రాంతాల్లో అహల్యా బాయి నిర్మించారాన్నారు.ఆమె 30 ఏళ్ల పాటు పరిపాలన సాగించిన తీరు, ఆమె చేసిన సేవ చిరస్మరణీయం అన్నారు.





