News

ఆపరేషన్​ సిందూర్​ సక్సెస్​ – పాక్ భూభాగంలో నష్టానికి బాధ్యత వారి ఆర్మీదే

153views

పాకిస్థాన్​ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్‌ ఆర్మీదే బాధ్యత అని ఎయిర్‌ మార్షల్‌ ఏకే భార్తీ అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్‌ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని తెలిపారు. పీవోకేలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతం అయ్యిందని వెల్లడించారు. ఉగ్రవాదుల శిబిరాలు లక్ష్యంగానే దాడులు చేశామన్నారు. పాకిస్థాన్ సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదని పేర్కొన్నారు. పాకిస్థాన్ వైపు నుంచి దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. భారత సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని తెలిపారు. ఈ మేరకు భారత డీజీఎమ్​ఓ సమావేశంలో భార్తీ వివరాలు వెల్లడించారు.

ఆపరేషన్​ సిందూర్​లో ఆకాశ్​ మిస్సైల్
ఆపరేషన్ సిందూర్​లో ఆశాశ్​ మిస్సైల వ్యవస్థను సమర్థంగా వినియోగించామని తెలిపారు. చైనా తయారీ పీఎల్‌-15 క్షిపణిని నేలకూల్చినట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్ల కూల్చేసినట్లు చెప్పారు.