
311views
హిందుస్థాన్ షిప్‌యార్డులో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన భారత నౌకాదళానికి చెందిన డైవింగ్ సపోర్టు వెసల్ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ పదో పర్యాయం సీట్రయల్‌కు వెళ్లింది. ఈ వెసల్ రక్షణ అవసరాల నిమిత్తం నౌకాదళ సేవల్లో త్వరలో చేరనుంది. ఈ నేపథ్యంలోనే పలు కోణాల్లో వెసల్‌ను సముద్ర యానంలో నిశితంగా పరీక్షలు జరుపుతున్నారు. 10న సీ ట్రయల్‌కు వెళ్లగా.. మూడు రోజులపాటు ఇది కొనసాగనుందని సంస్థ ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి. గతంలో నిస్తార్‌ను సబ్‌మెరైన్ రెస్క్యూ వెసల్‌గా వాడారు. 1971లో నిస్తార్ డైవింగ్ ఆపరేషన్స్ చేపట్టింది. పాక్ నేవీ సబ్‌మెరైన్ ఘాజీపై నిస్తార్ అటాక్ చేసింది.





