News

రాజమహేంద్రవరంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలి

213views

ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి రైతుల అవసరాలు తీర్చేందుకు వీలుగా రాజమహేంద్రవరంలో కొబ్బరి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె దీనిపై ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘1981లో ఏర్పాటు చేసిన కొబ్బరి బోర్డు.. కొబ్బరి సాగు విషయంలో రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన మొక్కలు అందించడం, ఎరువులను సిఫార్సు చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అయితే దీని ప్రధాన కార్యాలయం కేరళలో, ప్రాంతీయ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌కు దూరంగా ఉండటంతో రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీడపీడల నియంత్రణలో సలహాలు, చెట్లు ఎక్కేవారికి బీమా సౌకర్య కల్పన, సబ్సిడీలు అందుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తీర్ణం పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరంలో కొబ్బరి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలి’ అని పురందేశ్వరి కోరారు.