News

జాతీయ జెండా ఆవిష్కరణ చోటే ఖలిస్తానీ జెండా,

277views

పంజాబ్ లో గణతంత్ర దినోత్సవం ముందు ఓ ఘటన జరిగింది. గణతంత్ర దినోత్సవం జరిగే ఫరీద్ కోటలోని నెహ్రూ స్టేడియం దగ్గర ఖలిస్తాన్ నినాదాలు, ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి నెహ్రూ స్టేడియంలోనే జెండావిష్కరణ చేయాల్సి వుంటుంది. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాయడం ఆ ప్రాంతంలో ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మరోవైపు ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జెండావిష్కరణ చేసే కార్యక్రమ స్థలాన్నే మార్చేసినట్లు తెలుస్తోంది. పాటియాలా లేదా మొహాలీలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జెండాను ఎగరేయనున్నారు.సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ మరియు టెర్రరిస్ట్ గురుపతన్వ్ పన్నూ ఫరీద్‌కోట్‌లో ఈ మొత్తం చర్య గురించి సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో పన్ను సీఎం భగవంత్ మాన్‌ను బెదిరించారు కూడా.