News

గణతంత్ర దినోత్సవం : జంతువధ, మద్యం అమ్మకాలపై నిషేధం

462views

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జనవరి 26నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. తిరిగి సోమ‌వారం ఉద‌యం తెరుచుకుంటాయి. ఈ మేర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్యం, మాంసం విక్ర‌యించే దుకాణదారుల‌కు ఆదేశాలు జారీ చేశాయి. శనివారం రాత్రి నుంచే జంతు వ‌ధ‌ను నిషేధించిన‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించాయి. అన్ని ప‌ట్ట‌ణాల్లోనూ ఇవే ఆదేశాలు జారీ అయ్యాయి.

కబేళాలు, మాంసం అమ్మకపు దుకాణాలు మూసివేయాలని, హోటళ్ళు, రెస్టారెంట్లులో సైతం మాంసపు పదార్థాలు విక్రయించకూడదని కర్నూలు ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదేశాకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, వ్యాపార ట్రేడ్ లైసెన్స్ రద్దు, భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

స్వాతంత్ర్య దినోత్స‌వం, రిప‌బ్లిక్ డే, గాంధీ జ‌యంతి రోజుల్లో మ‌ద్యం, మాంసం విక్ర‌యాల‌పై ప్ర‌భుత్వాలు నిషేధం విధిస్తుంటాయి. రేప‌టి 76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం కార‌ణంగా తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.