
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో దుండగులు సరస్వతీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో సరస్వతీ మాత పూర్తిగా ధ్వంసమైంది. నార్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని సరస్వతీ మాత విగ్రహం ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పులిమామిడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరస్వతీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులతో పాటు డీఈఓకి కూడా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ సరస్వతీ దేవి విగ్రహ ధ్వంసాన్ని ఖండించారు. విద్యార్థులు ఆరాధించే సరస్వతీ మాత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం దారుణమన్నారు.జ్ఞానానికి స్వరూపంగా సరస్వతీ మాతను ఆరాధిస్తామని, సాధనకు ప్రతీకగా కొలుస్తామన్నారు.




