
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ప్రచార రథాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఉద్దేశించిన ఈ ప్రచార రథంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు.అనంతరం ఈఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల గ్రామాలకు ధర్మ ప్రచార రథం వెళుతుందన్నారు. అక్కడ స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. సనాతన ధర్మ సూత్రాలు, నైతిక విలువలు, ఆలయ పవిత్రతపై స్థల పురాణంపై భక్తులకు తెలియపరుస్తారన్నారు.కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి, బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.బంగారుపాళెం మండలంలోని మొగిలిలో మంగళవారం ప్రచార రథ సేవ నిర్వహించామని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు.మొగిలీశ్వరస్వామి దేవస్థానం వద్ద ప్రచార రథానికి పూజలు జరుగుతున్నాయన్నారు. అలాగే ప్రవచనాలు, భజనలు, కోలాటం, చెక్క భజన, భక్తి గీతాలు, గోపూజ, కల్యాణోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.





