News

పాట్నాలో బయటపడ్డ శతాబ్దాల కాలం నాటి పురాతన దేవాలయం

363views

సనాతన ధర్మీయులకు మరో శుభవార్త. శతాబ్దాల కాలం నాటి మరో పురాతన ఆలయం బయటపడింది. ఇది జరిగింది పాట్నలోని అలమ్ గంజ్ ప్రాంతంలో. ఈ ఆలయం నల్ల గ్రానైట్ తో నిర్మితమైనట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భూమి కుంగిపోయింది. దీంతో ఆలయం వెలుగులోకి వచ్చింది.దీంతో వెంటనే స్థానికులు ఆ ప్రాంతాన్ని తవ్వారు. ఆలయం బయటికి వచ్చేసింది. శివలింంతో పాటు పాద ముద్రలు కూడా స్పష్టంగా ద్యోతకమయ్యాయి. ఈ శివలింగం అష్ట ధాతవులతో తయారు చేశారు. 15 వ శతాబ్దానికి చెందిన ఆలయంగా దీనిని చెబుతున్నారు.

ఈ వార్త వ్యాప్తి కావడంతో వందలాది మంది భక్తులు ఈ దేవాలయం సమీపంలోకి చేరుకున్నారు. శివలింగాన్ని దర్శించుకొని, పూజలు ప్రారంభించారు. హర్ హర్ మహాదేవ్ అంటూ భక్తితో నామ స్మరణ చేశారు. అత్యంత పురాతన ఆలయం వెలుగులోకి రావడంతో హిందువులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆలయం ఇటీవల వరకూ డంపింగ్ గ్రౌండ్ గా వుంది. ఈ ఆలయ భూములు మఠానికి చెందినవిగా తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడి సమీపంలో ఒక పూజారి ఉండేవాడని, అతని మరణం తరువాత, పూజారి కుటుంబ సభ్యులు కూడా స్థలాన్ని ఖాళీ చేసినట్లు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత కుటుంబం ఈ స్థలాన్ని విడిచిపెట్టేశారని, స్థలంలో వున్న ఆలయం గురించి పూర్తిగా తెలియకపోవడంతో ఇది డంపింగ్ గ్రౌండ్‌గా మారిపోయిందని అంటున్నారు.