
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన చేజర్ల మండలం ఆదురుపల్లిలో చోటుచేసుకుంది. బాధిత బంధువులు, స్థానికుల వివరాల మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె భవ్యశ్రీ (8). ఈ బాలికకు 2నెలల క్రితం ఆరోగ్యం బాగోలేక నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ తీసి.. బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించి.. చెన్త్నెకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కుగానీ, చెన్నైగానీ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఆదూరుపల్లిలోని చర్చిలో ప్రార్థనలు చేస్తే జబ్బు నయమవుతుందని కొందరు బంధువులు చెప్పారు. ఈ లోపు ఒక రోజు చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుందామని చేజర్ల మండలం ఆదురుపల్లికి వెళ్లారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సమ్మతించి వేచి చూశారు. వారం రోజుల తరువాత బాలిక కొంత హుషారుగా కనిపించడంతో చర్చిలోనే ఉంచారు.. దీంతో వారు భవ్యశ్రీతోపాటు చర్చికి చేరుకుని 40రోజులుగా అక్కడే ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చారు. బిడ్డ పరిస్థితి క్షీణిస్తున్నా దేవుడినే నమ్ముకున్నారు. చివరికి.. చర్చి పాస్టర్ కూడా వారిని వారించలేదు. బిడ్డ ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు. అదే నమ్మకంతో ఉన్నారు. భవ్యశ్రీ ఆరోగ్యం క్షీణంచి చివరకు సోమవారం అర్ధరాత్రి చర్చిలోనే ప్రాణాలు విడిచింది. 40రోజుల తరువాత బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి.. సోమవారం రాత్రి చనిపోయింది. దీంతో లక్ష్మయ్య, లక్ష్మీ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి భవ్యశ్రీతోపాటు మరో కుమార్తె, ఒక కుమారుడు సంతానం.
చర్చి వద్ద ఆందోళన.. బాలికకు సరైన చికిత్స అందకుండా ఆమె తల్లిదండ్రులను మత బోధకుడు మభ్యపెట్టారని బంధువులు ఆరోపించారు. ఆదూరుపల్లిలోని ప్రార్థనా మందిరం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.





