News

నా గ్రామమే నా తీర్థ క్షేత్రం

317views

ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కోలుకుల గ్రామంలో నా గ్రామమే నా తీర్థ క్షేత్రం కార్యక్రమంలో భాగంగా శ్రీ హరిహర సేవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన చేశారు.