News

ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబరు 21

314views

ఏటా డిసెంబరు 21న ‘ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని’ నిర్వహించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐరాస ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ‘‘సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు..! ఏటా డిసెంబరు 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్‌ సహా ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. ‘వసుధైక కుటుంబకం’ అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్‌.. ప్రపంచ శ్రేయస్సు కోసం పాటుపడుతోంది. 193 మంది సభ్యులున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీ శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) సమావేశమై దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది’’ అని తెలిపారు.